అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లోని మంత్రి కార్యాలయంలో రజక, నాయీ బ్రాహ్మణ సంఘాలతో మంత్రి భేటీ అయ్యారు.
250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం విధివిధానాలపై చర్చించారు. బడుగు, బలహీన వర్గాల కులవృత్తి దారుల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వావలంబనే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల అన్నారు. ఇప్పటివరకు కేవలం 200 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, త్వరగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకే కులం, ఒకే సంఘంగా ఏర్పడి రజకులు, నాయీ బ్రాహ్మణులు లబ్ది పొందాలని కోరారు.
ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి