తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని చెప్పలేదంటే... కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అయోధ్య రామాలయానికి తడిబట్టలతో రావాలని... పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షపాతేనని... ఉద్యమాలన్నీ రైతులకు మేలు చేకూరే విధంగానే చేపడతామని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ధాన్యం దిగుబడులు తగ్గుతాయని ఆ ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే ఇండియా గేట్ వద్ద ధాన్యం పోసి నిరసన తెలిపే విధంగా... ఆందోళనలు కొనసాగిస్తామంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: స్థానిక సంస్థల్లో ఖాళీ పదవులకు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ