కరోనా సమయంలో కూలీలు, నిరుపేదలు ఇబ్బంది పడకూడదని... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెల 12 కిలోల బియ్యం అందించారని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆర్థికంగా భారమున్నప్పటికీ... కూరగాయలు తెచ్చుకునేందుకు వీలుగా రూ.1500 వారి ఖాతాల్లో వేశారని తెలిపారు.
పేదవారికి ఇబ్బంది కలిగే విధంగా... కరోనా సమయంలో కూరగాయల రేట్లు పెంచారనే ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు. చింతపండు తప్పా... మిగిలిన ఏ కూరగాయల, నిత్యవసరాల రేట్లు పెరగలేదని మంత్రి వెల్లడించారు. నిరుపేదలు బాధపడకూడదని చాలా మంచి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని గంగుల పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి'