రాష్ట్రంలో పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో సమావేశం జరిపారు. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనాతో సహజీవనం తప్పదని అభిప్రాయపడ్డారు.
జ్వరం, దగ్గు వంటి లక్షణాలను అశ్రద్ధ చేయవద్దని ఈటల హెచ్చరించారు. ప్రైవేట్, ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు కొనసాగించాలని కోరిన ఈటల.. రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి జ్వర పరీక్షలపై ఆరా తీశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగినన్ని మందులు అందుబాటులో ఉంచాలని టీఎస్ఎంఐడీసీకి సూచించారు.
ఇదీ చూడండి : ఊరూరా తిరుగుతూ... అవగాహన కల్పిస్తూ...