కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సమస్యలపై చర్చించామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా తీవ్రత, కేసులు తగ్గినా... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బతుకమ్మ, దసరా సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
కేరళలో మొదట్లో కేసులు తక్కువగా నమోదయ్యాయని... ఓనమ్ వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడంతో ఒక్కసారిగా కరోనా పెరిగిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... పండుగలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. లేకుంటే కేరళ తరహాలో సమస్యుల వస్తాయని హెచ్చరించారు.
గాంధీ మినహా అన్ని ఆస్పత్రుల్లో అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వెల్లడించారు. కొవిడ్ సేవల్లో ఉన్న వైద్య సిబ్బంది మినహా ఇతరులు విధులకు హాజరవ్వాలని మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు