ETV Bharat / state

ప్రతి ఇంటికీ మిషన్​ భగీరథ నీరు అందాలి: ఎర్రబెల్లి - Minister Errabelli review meeting

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మిషన్​ భగీరథ నీరు సరఫరా కావాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆదేశించారు. శుద్ధి చేసిన మంచినీరు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే.. సీఎం కేసీఆర్​ స్వప్నం సాకారమవుతుందని తెలిపారు. ఈ మేరకు మిషన్​ భగీరథ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Minister Errabelli review meeting with officials on the progress of Mission Bhagiratha
ప్రతి ఇంటికీ మిషన్​ భగీరథ నీరు అందాలి: ఎర్రబెల్లి
author img

By

Published : Sep 28, 2020, 10:55 PM IST

రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావాలని, నల్లా లేని ఇళ్లు రాష్ట్రంలో ఒక్కటి కూడా ఉండొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అధికారులు, ఇంజినీర్లతో సమావేశమైన మంత్రి.. మిషన్ భగీరథ పురోగతిపై సమీక్షించారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుద్ధి చేసిన మంచినీరు అందినప్పుడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారం అవుతుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న స్థిరీకరణ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆశించిన మేర స్థిరీకరణ జరగని జిల్లాలపై చీఫ్ ఇంజినీర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.

గ్రామాల్లో కొత్తగా నిర్మిస్తోన్న రెండు పడక గదుల ఇళ్ల కాలనీలకు సైతం భగీరథ నీటిని సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఆయా శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి సమన్వయంతో పనులు పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠదామాలకు సైతం మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇదీచూడండి: ప్రతి కార్యకర్తను కలుస్తా.. పార్టీని బలోపేతం చేస్తా: మాణిక్కం ఠాగూర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.