ETV Bharat / state

Errabelli Review: 'ఉపాధి హామీ అమ‌లులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది'

ఉపాధిహామీ పథకం కింద ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు 9 కోట్ల 80 లక్షల పనిదినాలు కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జిల్లాల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు(ZP CEO), డీఆర్డీఏ(DRDA) అధికారులు, డీపీవో(DPO)లతో హైదరాబాద్ నుంచి వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి... పల్లెప్రగతి, వివిధ పథకాల అమలును సమీక్షించారు.

panchayati raj minister
MINISTER ERRABELLI dayakar rao
author img

By

Published : May 27, 2021, 8:08 PM IST

ఉపాధిహామీ (MGNREGA) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా ఉన్న 13కోట్లలో... ఇప్పటికే 9 కోట్ల 80 లక్షల పనిదినాలు కల్పించామని మంత్రి తెలిపారు. గతేడాది ఈ సీజన్​లో 17 లక్షల 50 వేల మంది కూలీలు పనిచేస్తే ప్రస్తుతం ఇప్పటికే 25 లక్షల 79 మంది పనిచేశారని వివరించారు. కొవిడ్(Corona)​ కష్టకాలంలో నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఉపాధిహామీ ప‌థ‌కం అమ‌లుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న అధికారుల‌ు, ఉద్యోగుల‌ను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.

వచ్చే 15 రోజులు పని చూపండి

కొవిడ్​ విజృంభణ, లాక్​డౌన్​ కారణంగా చాలా మంది పట్టణాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారని, వారందరికీ జాబ్ కార్డులిచ్చి ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల్లో ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రధాన పంట కాల్వలు, ఫీల్డ్ ఛానల్స్ పూడికతీతను వర్షాకాలం ముందే పూర్తి చేయాలని చెప్పారు.

జ్వర సర్వేలో చురుగ్గా పాల్గోవాలి

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జ్వరసర్వేలో పంచాయతీ కార్యదర్శులు చురుగ్గా పాల్గొనాలని కోరారు. నెలాఖరులోగా వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని... పనులు పూర్తైన వైకుంఠధామాలు, చెత్త షెడ్లను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు. హరితహారంలో నిరుడు వందశాతం లక్ష్యాన్ని సాధించామన్న మంత్రి... ఈ మారు కూడా వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని చెప్పారు.

వ్యాక్సిన్​ వేయించుకోండి

ఇంకా మిగిలిన పంచాయతీ, ఉపాధిహామీ సిబ్బందికి వెంటనే కొవిడ్ టీకాలు వేయించాలని... సూపర్ స్ప్రెడర్లకు టీకాల కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖకు పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సహకరించాలని ఎర్రబెల్లి(Minister Errabelli DayakarRao) తెలిపారు.

ఇదీ చూడండి: viral video: పోలీసులు బైక్​ తీసుకున్నారంటూ రోడ్డుపై పడుకొని హంగామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.