ETV Bharat / state

ప్రతి గ్రామానికి మంచి నీరు అందాలి: మంత్రి ఎర్రబెల్లి - తెలంగాణలో మిషన్​ భగీరథ పథకం తాజా వార్తలు

ప్రజావసరాలు తీరే విధంగా మంచినీటిని అందించాలని గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి, గల్లీకి తాగునీరు అందాలని సూచించారు. ఎండాకాలంలో క‌త్తెర కార్తె వ‌చ్చింద‌ని, ఈ నెల రోజుల పాటు ఎండ‌లు తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉన్నందున ఈ ద‌శ‌లోనే మంచినీటి వాడ‌కం కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రతి గ్రామానికి మంచి నీరు అందాలి: మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : May 16, 2020, 7:13 PM IST

మిషన్ భగీరథ మంచినీటి సరఫరా పథకాన్ని ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా.. ప్రజావసరాలు తీరే విధంగా ఉండాలని గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని మిషన్ భగీరథ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లా ఎస్సీ, ఈఈలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎండాకాలంలో క‌త్తెర కార్తె వ‌చ్చింద‌ని, ఈ నెల రోజుల పాటు ఎండ‌లు తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉన్నందున ఈ ద‌శ‌లోనే మంచినీటి వాడ‌కం కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ స‌మ‌యంలో అధికారులు మ‌రింత అప్రమ‌త్తంగా ఉండి ప‌ని చేయాల‌ని సూచించారు. ప్రతి రోజూ, ప్రతినిత్యం నిరంత‌రం మానిటరింగ్ చేయాల‌ని.. మంచినీరు అందడంలేద‌న్న గ్రామం కానీ, గ‌ల్లీ కానీ లేకుండా జాగ్రత్త ప‌డాల‌ని మంత్రి.. అధికారుల‌ను ఆదేశించారు.

"స‌మ‌స్యలేమైనా వ‌స్తే వెంట‌వెంట‌నే ప‌రిష్కరించే విధంగా సంసిద్ధంగా ఉండాలి. క‌రోనా, లాక్ డౌన్​ల కార‌ణంగా పెండింగ్​లో ఉన్న ప‌నులేవైనా ఉంటే వాటిని స‌త్వర‌మే పూర్తి చేయాలి. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం కింద రాష్ట్రంలోని 23,968 ఆవాసాల‌కు నూటికి నూరు శాతం ఆరోగ్యవంత‌మైన మంచినీటిని అందిస్తున్నాం. 55 లక్షల 59 వేల 172 ఇళ్లకు వంద శాతం నీరందుతోంది. 19 ఇన్ టెక్ వెల్స్, 50 నీటి శుద్ధి కేంద్రాలు, 1163 స‌ర్వీస్ రిజర్వాయర్లు, 441 సంపులు మౌలిక స‌దుపాయాలుగా మంచినీరు అందిస్తున్నాం. అలాగే ల‌క్షా 46వేల కి.మీ. పైపు లైన్ల ద్వారా ఈ మంచినీటిని అందిస్తున్నాం."

-ఎర్రబెల్లి దయాకర్​ రావు, మంత్రి

ప్రతి గ్రామానికి మంచి నీరు అందాలి: మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి: రిక్షా బాలుడు: తల్లీదండ్రుల భారాన్ని.. వందల కి.మీ మోస్తూ..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.