కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం 150 ఎకరాల భూమిని సేకరించి ఇస్తే ఇక్కడ ఏర్పాటు చేయకుండా... ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి వచ్చే పన్నుల ఆదాయాన్ని తీసుకెళ్లి భాజపా పాలిత రాష్ట్రాలకు తరలిస్తోందని ఎర్రబెల్లి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర భాజపా నేతలు ఇంకా ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
భాజపా నేతలను వరంగల్ ప్రజలే తరిమి కొడతారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తామన్న ఆయన... కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. బాబ్లీ కోసం పోరాడినట్లే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడతానని దయాకర్ రావు చెప్పారు.
ఇదీ చూడండి: ఇంటర్ బోర్డు ముట్టడికి భాజపా యువ మోర్చా యత్నం