Errabelli On Bjp: కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతులను దగా చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
minister errabelli: ఎరువుల ధరలు తగ్గించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధరల పెంపును సమర్థించుకునేలా భాజపా నేతలు మాట్లాడటం సిగ్గు చేటని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కోరి ఐదేళ్లవుతున్నా కేంద్రం స్పందించడం లేదని మంత్రి ఆరోపించారు.
errabelli on fertiloizers: వ్యవసాయ చట్టాలను రద్దు చేసి.. రైతులను ఇబ్బంది పెట్టేందుకు మరో రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన భాజపా, కాంగ్రెస్ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై పోరాడిన రేవంత్ రెడ్డి... ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కూడా సరిగా ఇవ్వలేక పోయిందని.. శ్రీరాంసాగర్ ఆయకట్టును ఎండ కట్టిందని విమర్శించారు. పరిశ్రమలకు విద్యుత్ సరిగా ఇవ్వడం లేదంటూ ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలతో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో ఆయా పార్టీలు వివరాలు ఇచ్చిన తర్వాత.. దానిపై చర్చ గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే భాజపా నేతలను ప్రజలే ఉరికించి కొడతారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
ఎరువుల ధరలు పెంచి సిగ్గులేకుండా కొందరు భాజపా నాయకులు మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరంలోనే పొటాష్ ధర రూ.700 పెంచారు. ఎరువుల ధరలు పెంచి రైతులను ఇబ్బంది పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలే. ప్రతి రైతుకు ఎరువులు అవసరం. రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించాలే. ప్రతిదీ కొనాలే. కేంద్రం రైతుల మీద కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కేంద్రం చర్యలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం. - ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి
ఇవీ చూడండి:
- Minister errabelli: 'బహిర్భూమి రహిత ఆవాసాల్లో ఔత్సాహిక మోడల్‌గా తెలంగాణ'
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కరోనా పాజిటివ్
- Errabelli comments on central Govt : 'కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి మరోమారు బట్టబయలైంది'
- Errabelli on MPTC's: వారి అధికారాలపై విపక్షాలది అనవసర రాద్ధాంతం: ఎర్రబెల్లి
- తెలంగాణ అభివృద్ధిపై 'యోజన' ప్రత్యేక సంచిక.. విడుదల చేసిన మంత్రి ఎర్రబెల్లి