ETV Bharat / state

'సర్పంచ్​లు బీజేపీ ట్రాప్‌లో పడి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు' - పంచాయతీల అభివృద్ధిపై ఎర్రబెల్లి దయాకర్‌ సమీక్ష

కొంతమంది సర్పంచులు బీజేపీ ట్రాప్‌లో పడి రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. నిధుల విషయంపై సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Minister Erpabelli Dayakar Rao
Minister Erpabelli Dayakar Rao
author img

By

Published : Dec 31, 2022, 6:47 PM IST

కేంద్రం కావాలనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపుతోందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. దీనివల్ల కొంత ఆర్థిక ఇబ్బంది ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సుమారు రూ.1,100 కోట్ల నిధులు రావాల్సి ఉండగా.. రైతు కల్లాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.151 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుగా భావించి నిధులు ఆపుతుందని విమర్శించారు.

పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇంజినీర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ఆయన.. కొంతమంది సర్పంచులు బీజేపీ ట్రాప్‌లో పడి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల విషయంపై సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి పంచాయతీలో రోడ్లు అద్దంలా ఉండాలని, రోడ్లపై గుంతలు కనిపించకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంజినీర్లను ఆదేశించారు.

ఇటీవలే మంజూరు చేసిన 3,686 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని.. ప్రతి గ్రామంలోనూ వైకుంఠదామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలని ఆయన సూచించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లతో రోడ్ల ప్రతిపాదనల కోసం జాబితా తయారు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాల లబ్ధిదారులు, ప్రతి నెల వచ్చే మొత్తం, తెలంగాణ వచ్చాక ఆ గ్రామానికి అందిన మొత్తం వివరాలతో ప్రతి గ్రామ పంచాయతీలో బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.