ఆర్థిక స్తోమత లేక ఆసుపత్రుల్లో చూపించుకోని నిరుపేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ విద్యార్థుల పురస్కార ప్రదానోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఒకప్పుడు చెరువులు తవ్వడంలో ముఖ్య పాత్ర వహించి వ్యవసాయానికి అండగా ఉన్న జాతి సగర జాతి అని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వృత్తిలోకి చాలామంది రావడం వల్ల వారికి ఉపాధి తగ్గిందని... అయినా వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్లో ఒక అడ్డా ఉండాలని సగర సంఘానికి ఒక భవనం కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్యపై గవర్నర్ను కలిసిన విపక్ష నేతలు