ETV Bharat / state

జనవరి 1నుంచే నుమాయిష్​: ఈటల రాజేందర్​

నుమాయిష్​ జనవరి 1న ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్​ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు.

MINISTER EETELA RAJENDAR SPOKE ON NUMAISH
జనవరి 1నుంచే నుమాయిష్​: ఈటల రాజేందర్​
author img

By

Published : Dec 30, 2019, 6:35 AM IST

Updated : Dec 30, 2019, 7:31 AM IST

హైదరాబాద్​ నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానంలో ఏటా నిర్వహించే అఖిల భారతీయ పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్​) జనవరి 1న ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్​ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూ.3కోట్లతో రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అగ్నిమాపక వాహనాలు సహా అండర్​గ్రౌండ్​ కేబుల్​ వ్యవస్థనూ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించేలా శిక్షణ పొందిన 40 మందిని నియమించామని తెలిపారు.

ఏటా ఎగ్జిబిషన్​ను సందర్శించడానికి 20 లక్షల మంది వస్తున్నారని, వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. నుమాయిష్​ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 18 విద్యాసంస్థలకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు.

జనవరి 1నుంచే నుమాయిష్​: ఈటల రాజేందర్​

ఇవీ చూడండి: ఆయుర్వేద వైద్యం వైపు మళ్లీ మక్కువ : మంత్రి ఈటల

Last Updated : Dec 30, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.