ETV Bharat / state

కరోనా మొదటి వేవ్​కు రెండో వేవ్​కు చాలా తేడా ఉంది: ఈటల - minister eetala tele-conference on corona

కరోనా మొదటి వేవ్​కు, రెండో వేవ్​కు చాలా తేడా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. రెండో దశలో వైరస్​ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో టెలీ-కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

మంత్రి ఈటల టెలీ-కాన్ఫరెన్స్​
మంత్రి ఈటల టెలీ-కాన్ఫరెన్స్​
author img

By

Published : Apr 14, 2021, 5:46 PM IST

రాష్ట్రంలో కొవిడ్​ రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్​ ఆదేశించారు. కరోనా మొదటి వేవ్​కు, రెండో వేవ్​కు చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల అధికారులతో పాటు డీఎంఈ రమేశ్​ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రధానంగా గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో వైద్యులు వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించాలని మంత్రి సూచించారు. కరోనా టెస్టుల్లో వేగం పెంచాలని కోరారు. ఎక్కువ మంది రోగులు హోం ఐసోలేషన్​లో ఉండేలా కౌన్సెలింగ్ ఇవ్వాలన్న ఈటల.. ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా వైరస్​తో చనిపోయిన వారి మృతదేహాలను ఎలాంటి ఇబ్బందిలేకుండా కుటుంబసభ్యులకు అందించేందుకు గ్రామ పంచాయతీ, స్థానిక మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

టిమ్స్​ సందర్శన..

అనంతరం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రిలో మందులు, బెడ్లు, సిబ్బంది కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇదీ చూడండి: 'మాస్క్‌ లేకపోతే సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా వేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.