హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నెక్, పౌల్ట్రీ సమాఖ్య ఆధ్వర్యంలో చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భారత్‌లో చికెన్ తిని ఎవరూ చనిపోలేదని మంత్రి ఈటల అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతుల వల్లే చికెన్, గుడ్ల వినియోగం తగ్గిందని తెలిపారు. బ్రాయిలర్ పెంపు వ్యయం రూ.77 ఉంటే రూ.35కు అమ్మాల్సి వస్తోందని పేర్కొన్నారు. గుడ్డు ఉత్పత్తి రూ.4 ఉంటే రూ.2.80 చొప్పున విక్రయించాల్సి వస్తోందని చెప్పారు. గత 2 నెలల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రూ.500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఇవీ చూడండి: మళ్లీ కోర్టుకెళ్లిన నిర్భయ దోషి.. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు