ETV Bharat / state

కరోనా సెకండ్ వేవ్​ సన్నద్ధతపై మంత్రి ఈటల సమీక్ష - కరోనా సెకండ్ వేవ్ వార్తలు

దిల్లీలో పరిస్థితులు చేయి దాటుతున్న నేపథ్యంలో సెకండ్ వేవ్ రాష్ట్రంలో ప్రారంభమైతే సరైన చికిత్స అందించేందుకు ఉన్న సన్నద్ధతపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా సెకండ్ వేవ్​ సన్నద్ధతపై మంత్రి ఈటల సమీక్ష

author img

By

Published : Nov 21, 2020, 8:15 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్... ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బీఆర్​కే భవన్​లో జరిగిన సమావేశంలో ఆరోగ్య సలహా కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేశ్​రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్​రెడ్డి, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.

సమీక్షలో పండుగలు, ఎన్నికల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై చర్చించినట్టు సమాచారం. దిల్లీలో పరిస్థితులు చేయి దాటుతున్న నేపథ్యంలో సెకండ్ వేవ్ రాష్ట్రంలో ప్రారంభమైతే సరైన చికిత్స అందించేందుకు ఉన్న సన్నద్ధతపై అధికారులను మంత్రి అడిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొవిడ్​ను ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయి నుంచి పూర్తి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు.

ఇదీ చూడండి: బురిడి కొట్టించి ఒకటి రెండు సీట్లు గెలుస్తారేమో: కవిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.