ETV Bharat / state

రోజూ 10లక్షల మందికి టీకా ఇచ్చేందుకు సిద్ధం : ఈటల

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ వైద్య కళాశాలల క్రికెట్ పోటీలను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. కరోనా యోధులు క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. తెలంగాణలో సెకండ్ వేవ్ లేదని స్పష్టం చేశారు.

author img

By

Published : Jan 1, 2021, 1:27 PM IST

Updated : Jan 1, 2021, 8:10 PM IST

Minister eetala Rajender inaugurated the cricket tournament at the LB Stadium
రోజుకు 10 లక్షల మందికి టీకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కళాశాలల వైద్యుల క్రికెట్ పోటీలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. కరోనా యోధులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు మంత్రి ఈటల. వ్యాక్సిన్ రాగానే 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

తెలంగాణలో సెకండ్ వేవ్ లేదని.. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టిందని ... కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ సీసీఎంబీకి పంపించామని వెల్లడించారు.

కరోనా వారియర్స్‌కు ఉపశమనం కలిగించేందకు క్రికెట్‌ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ ఎవలేట్‌ కంపెనీ ఎండీ విద్యాసాగర్‌ అన్నారు. ఈ టోర్నీ విజేతలకు తమ తరుఫున మూడు స్కూటీలు బహుమతులుగా ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఒలంపియన్ జేజే శోభా, బాక్సర్ నికత్ జరీన్, ఇంటర్ నేషనల్ షూటర్ ఈషా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ మూడు రోజల పాటు జరగనుంది. టోర్నీలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీల జట్లు పాల్గొంటున్నాయి.

Last Updated : Jan 1, 2021, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.