ETV Bharat / state

హైదరాబాద్​కు ఏదో అవుతుందనే విషపు ప్రచారం ఆపండి: మంత్రి ఈటల

author img

By

Published : Jun 24, 2020, 5:37 PM IST

Updated : Jun 24, 2020, 8:10 PM IST

హైదరాబాద్‌లో ఏదో అవుతుందనే దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కరోనా లక్షణాలు ఉంటే పీహెచ్‌సీల్లో సంప్రదించాలని కోరారు. లక్షణాలు లేనివాళ్లు పరీక్షలు చేసుకోవద్దని మరోమారు స్పష్టం చేశారు.

Minister eetala rajender conduct the press on health department
హైదరాబాద్‌పై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు: ఈటల రాజేందర్

కరోనా లక్షణాలు లేనివాళ్లు పరీక్షలు చేసుకోవద్దని మరోమారు స్పష్టం చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో ఏదో అవుతుందని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు మసిపూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చిత్తశుద్ధిని ఎవరూ శంకించొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉంటే పీహెచ్‌సీల్లో సంప్రదించాలని కోరారు. పీహెచ్‌సీ స్థాయిలోనే నమూనాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యంలోనే అన్ని రకాల సేవలు అందిస్తూ.. రూపాయి ఖర్చు లేకుండా సేవలు అందిస్తున్నామని వివరించారు.

ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాలుగైదు రోజుల్లో టిమ్స్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టిమ్స్‌లో అవుట్ పేషెంట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఇంటిలోని వాళ్లపై సామాజిక బహిష్కరణ విధించడం, అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం సంస్కారం కాదన్నారు.

హైదరాబాద్‌లో ఏదో అవుతుందని దుర్మార్గమైన ప్రచారం తగదు. ప్రభుత్వ ప్రతిష్ఠకు మసిపూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించొద్దు. కరోనా లక్షణాలు ఉంటే పీహెచ్‌సీల్లో సంప్రదించండి. కరోనా లక్షణాలు లేనివాళ్లు పరీక్షలు చేయించుకోవద్దు. డబ్బులు మీవే అయినా సరే పరీక్షలు చేయించుకోవద్దు.

--- ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి

విషపు ప్రచారం తగదు: మంత్రి ఈటల

ఇవీ చూడండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Last Updated : Jun 24, 2020, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.