ETV Bharat / state

'వైద్యులు ఏది కోరినా.. ఒక్కరోజులో వారికి అందిస్తాం'

అన్ని జిల్లాల సూపరింటెండెంట్​లతో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కరోనాకు చికిత్స అందించాలని మంత్రి సూచించారు. వైద్యులు ఏది కోరినా... ఒక్కరోజులో వారికి అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

minister-eetala-rajendar-video-conference-with-district-hospital-superintendents
'వైద్యులు ఏది కోరినా... ఒక్కరోజులో వారికి అది అందిస్తాం'
author img

By

Published : Jul 6, 2020, 7:17 PM IST

కోఠిలోని కరోనా కమాండ్ సెంటర్​లో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో.. అక్కడ అవసరాలపై ఆయా ఆస్పత్రి సూపరింటెండెంట్​లతో ఈటల మాట్లాడారు.

రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న మెడికల్​ కాలేజీల్లో పూర్తిస్థాయిలో కరోనా చికిత్స అందించాలని మంత్రి సూచించారు. జిల్లా ఆస్పత్రుల్లో తక్కువ లక్షణాలున్న వారందరికీ చికిత్స అందించాలన్నారు. ఏ కొరత ఉండకుండా... వైద్యులు ఏది కోరితే అది ఒక్క రోజులో అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని... అలాంటి మానవత్వం ఇప్పుడు చాలా అవసరమని మంత్రి కొనియాడారు. మహబూబ్‌నగర్ సూపరింటెండెంట్‌.. జిల్లా ఆసుపత్రి క్వార్టర్స్‌లోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నందుకు అభినందనలు తెలిపారు. సూపరింటెండెంట్‌లు అందరూ జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: మానవత్వం మాయం: కరోనాతో మరణం... జేసీబీతో ఖననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.