ETV Bharat / state

అందరి సహకారంతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యం: మంత్రి ఈటల - Miniater_Etela_Meet_Doctors

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న వైద్యులతో ముఖాముఖి అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి ఈటల రాజేందర్. పూర్తి స్థాయిలో పనిచేసి ప్రజలకు సేవలందిస్తామని వైద్యులంతా మంత్రికి భరోసా ఇచ్చారు.

వైద్యులతో మంత్రి ఈటల ముఖాముఖి
author img

By

Published : Sep 24, 2019, 11:32 PM IST

వైద్యులతో మంత్రి ఈటల ముఖాముఖి

వైద్యులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ఆరోగ్య తెలంగాణకు అందరి సహకారం కావాలని... సర్కారు దవాఖానాపై ప్రజల్లో భరోసా కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తోడుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది నిర్విరామంగా పనిచేయడం వల్లే వైద్యరంగంలో తెలంగాణ ముందుకెళుతోందని మంత్రి అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాత ఐదేళ్లలో నాలుగు వైద్య కళాశాలలు వచ్చాయని ఎయిమ్స్​, ఈఎస్​ఐ కాలేజీలు కలిపితే మొత్తం ఆరు కళాశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తిస్థాయిలో సేవలందిస్తే ఉస్మానియా మీద భారం తగ్గుతుందని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పనిచేస్తున్న 9 ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలను విభాగాల వారీగా సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగుల రద్దీకి అనుగుణంగా వైద్యులు, నర్సుల సంఖ్య పెంచుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ

TG_Hyd_93_24_Miniater Etela Meet Doctors_Ab_TS10005 Note: Feed Etv Bharat, Desktop Contributor: Bhushanam ( ) ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న డాక్టర్స్ తో ముఖాముఖి అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి ఈటల రాజేందర్. పూర్తి స్థాయిలో పనిచేసి ప్రజలకు సేవ చేస్తామని డాక్టర్స్ మంత్రి కి భరోసా ఇచ్చారు. డాక్టర్స్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఆరోగ్య తెలంగాణ కు అందరి సహకారం చేయాలని... ప్రభుత్వ ఆసుపత్రి పై భరోసాతో ప్రజలు రావాలని కోరారు. కుటుంబం ఆస్తి అనే దగ్గర నుండి కుటుంబం భారం అనె దగ్గరికి మన సమాజం వచ్చిందన్నారు. అనేక పథకాలు తీసుకువచ్చి కేరళ తమిళనాడు తరువాత తెలంగాణ నిలిచిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా అరోగ్య శాఖ అధికారులు సిబ్బంది నిర్విరామంగా పని చేయడం వల్లనే ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ఇన్ని చేసినా కొన్ని చిన్న చిన్న సంఘటనలు మనకు కళంకం తెస్తున్నాయి ఇవి కూడా రాకుండా జాగ్రత్త పడదామని సూచించారు. రోగాలు ఉన్నవారు పేదవారు అన్న తేడా లేకుండా అందరికీ వస్తున్నాయని... గుడిసెలో ఉన్నవారికి మనమే దిక్కు.. అలా వచ్చినవారికి ప్రాణదానం చేస్తున్న వారు ప్రభుత్వ డాక్టర్స్ అని అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాత 5 సంవత్సరాల కాలంలో 4 మెడికల్ కాలేజీలు వచ్చాయని... Aims ESI medical కాలేజీలు కలిపితే మొత్తం 6 కాలేజీలు అయ్యాయని తెలిపారు. ఇవ్వన్నీ పూర్తి స్థాయిలో మొదలయితే గాంధీ ఉస్మానియా మీదా భారం తగ్గుతుందన్నారు. ఒస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధంగా పనిచేస్తున్న 9 ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలను డిపార్టుమెంటు ల వారీగా డాక్టర్స్ నుండి అభిప్రాయాలను మంత్రి తీసుకున్నారు. Pg డాక్టర్స్ అటెండెన్స్ ప్రతినెలా 25 వ తేదీలోగా పంపించాలని విభాగాధిపతి లకు మంత్రి ఆదేశించారు. రోగుల రద్దీకి అనుగుణంగా డాక్టర్స్, నర్సుల సంఖ్యను పెంచుతామని... ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బైట్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.