Minister Damodara Rajanarsimha Facebook Account Hacked Today : రోజురోజుకూ సైబర్ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి మంత్రుల వరకు ఎవరిని వదలడం లేదు. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Rajanarsimha) అధికారిక ఫేస్బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. సదరు పేజీలో బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫోటోలను వందల సంఖ్యలో పోస్టు చేస్తున్నారు.తన ఫేస్బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని అందులో వచ్చే పోస్టులకు ఎవరూ స్పందించవద్దని కార్యకర్తలకు మంత్రి తెలిపారు. హ్యాకింగ్ ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![Minister Damodara Rajanarsimha Facebook Account Hacked Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-01-2024/20513252_fb.jpg)