Minister Damodar Raja Narasimha Review on Corona : రాష్ట్రంలో 24 గంటల్లో 6 కొవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 538 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 14కు చేరగా, ఒకరు రికవరీ అయినట్లు స్పష్టం చేసింది. ఈరోజు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మొత్తం 6 కేసులు హైదరాబాద్‌కు చెందినవి కావడం గమనార్హం. ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్న కేసుల్లో ఒకటి కరీంనగర్‌కు చెందినది కాగా మిగతా అన్ని హైదరాబాద్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
'ప్రతి 3 నెలలకోసారి మాక్ డ్రిల్'- కొవిడ్ కేసులపై కేంద్రం అలర్ట్
కొవిడ్ నియంత్రరణపై మంత్రి రాజనర్సింహా సమీక్ష : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహా వైద్య ఆరోగ్య శాఖ(Health Minister) సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కొవిడ్ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహా, అనంతరం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana Government Guidelines on Covid 19 : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నిర్వహించిన సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, డీహెచ్ రవీంద్రనాయక్, డీఎంఈ త్రివేణి, గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ రాజారావు, ఉస్మానియా(Osmania) సూపరిండెంట్ నాగేంద్ర సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. గురువారం అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ల్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రులు అవసరమైన వనరులను టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా తీసుకోవాలని చెప్పారు.
Covid 19 JN1 Variant : ఇన్‌ఫ్లూయెంజా వంటి లక్షణాలు ఉంటే కొవిడ్ పరీక్షలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విధిగా ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీకి పంపాలన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులను మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేట్ కేవలం 0.31 శాతంగా ఉన్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో 9కి చేరిన కొవిడ్ కేసుల సంఖ్య - ముందస్తు చర్యల్లో అధికారులు