Minister Ajay Kumar inaugurated 50 TSRTC buses: ప్రజలు సొంత వాహనాల వినియోగం తగ్గించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద 50 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. 760 బస్సులకు గాను ప్రస్తుతం 50 బస్సులు ప్రారంభిస్తున్నామని.. వచ్చే ఏడాది మార్చి వరకు అన్ని బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సమిష్టి కృషితో ఆర్టీసీ సంస్థ అద్భుతంగా ముందుగా సాగుతోందని.. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
"టీఎస్ఆర్టీసీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ప్రైవేట్ వాహనాలు. తెలంగాణ ఏర్పడినప్పుడు 71 లక్షలు ఉన్న వాహనాల సంఖ్య ఇప్పుడు 1కోటి 50లక్షలకు చేరింది. ప్రజలు తక్కువ సమయం వెచ్చించడానికి.. దూరభారాలకు ప్రజలు వారి సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వాళ్లను ఆర్టీసీ బస్సుల వైపు మరల్చాలి. అప్పుడు మన కల సాకారం అవుతుంది." - పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రి
"ఈరోజు 30నుంచి 35లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పండగ సమయాల్లో ఈ సంఖ్య 45లక్షలు దాటిన చరిత్ర ఉంది. నగరవాసులు డబుల్ డెక్కర్ బస్సుల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మారుస్తున్నాము. వచ్చే ఐదేళ్లలో టీఎస్ఆర్టీసీ మొత్తం ఎలక్ట్రికల్ బస్సులతో నడుస్తోంది." - సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
ఇవీ చదవండి: