ETV Bharat / state

మినీ అంగన్వాడీలకు మహర్దశ - ప్రధాన కేంద్రాలుగా ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 12:27 PM IST

Mini Anganwadis Upgradation In Telangana : ప్రభుత్వం తాజాగా మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్​వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమను కొత్త ప్రభుత్వం గుర్తించడంతో అంగన్వాడీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Govt Special Focus On Anganwadi Centres
Upgradation Mini Anganwadi In Telangana
మినీ అంగన్వాడీలకు మహర్దశ - ప్రధాన కేంద్రాలుగా ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు జారీ

Mini Anganwadis Upgradation In Telangana : అంగగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తాజాగా ఈ మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమను కొత్త ప్రభుత్వం గుర్తించడంతో అంగన్వాడీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Govt Special Focus On Anganwadi Centres : చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి సలహాలు సూచనలూ ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మారుస్తూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో మినీ అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ రానుంది. ప్రధాన అంగన్‌వాడీలుగా మినీ కేంద్రాల స్థాయి పెంపుతో లబ్దిదారులకు మరింత సేవలు అందనున్నాయి.

"మినీ అంగన్​వాడీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీంతో పిల్లలకు మంచి పోష్టికాహారం అందుతుంది. ఈ నిర్ణయం ద్వారా కొత్త ఆయాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మినీ అంగన్ వాడీ సెంటర్​కు ఆయా ఉంటనే అవి అభివృద్ది చెందుతాయి. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కూడా ఉంటుంది.'' -అంగన్​వాడీ టీచర్లు

Anganwadi Staff Strike in Mahabubnagar : అంగన్​వాడీల సమ్మెబాట.. కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు

Conversion of Mini Anganwadi Centers to Main Centres : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన, మినీ కలిపి మొత్తం 5వేల123 ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 152 మినీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. అలాగే ములుగులో 92, భూపాలపల్లిలో 55, వరంగల్‌లో 72, జనగామలో 39, హనుమకొండలో 31 కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ఎస్సీ, ఎస్టీ మినీ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 300 జనాభాకు పైగా ఇతర కేంద్రాల పరిధిలో 400 పైగా జనాభా ఉంటే వాటిని అప్‌గ్రేడ్ చేస్తారని భావించారు. అందుకు అనుగుణంగానే జిల్లాల వారీగా సంబంధిత శాఖ అధికారులు గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుత ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరిస్తూ‍‍ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మినీ అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ప్లే స్కూల్​ కాదండి బాబు.. 'అందమైన' అంగన్​వాడీ కేంద్రమే..

ఇప్పటి వరకూ లబ్దిదారులకు పౌష్ఠికాహారం అందించడానికి మాత్రమే టీచర్‌కు సమయం సరిపోయేది. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడం లేదు. ప్రభుత్వం చేపట్టే వివిధ సర్వేలు, కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కేంద్రాన్ని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు ప్రభుత్వం నూతనంగా ఆయా పోస్టులు భర్తీచేసే అవకాశం ఉండడంతో టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మినీ అంగవాడీ టీచర్ల వేతనం కూడా 7వేల800 నుంచి 13వేల650 రూపాయలకు పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కొత్త టీచర్లతో పాటు కొత్త ఆయాలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు చెబుతున్నారు.

కొత్తగా 10 లక్షల పెన్షన్లు.. 5వేల అంగన్​వాడీ పోస్టులు.. కేబినెట్​లో కీలక నిర్ణయాలు

Anganwadi Teachers and Helpers Retirement Age Increased : అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్​న్యూస్​..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.