ETV Bharat / state

సభ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

హైదరాబాద్ భోలక్​పూర్​లో జరిగిన ఎంఐఎం పార్టీ బహిరంగ సభ నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అర్ధాంతరంగా నిష్క్రమించారు. మజ్లిస్ అభ్యర్థికి మద్దతుగా వచ్చి.. మధ్యలో వెళ్లిపోవడం వల్ల కార్యకర్తలు, ప్రజలు అసంతృప్తికి గురయ్యారు.

mim mla akbaruddin
మైనార్టీ సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్
author img

By

Published : Nov 24, 2020, 7:03 AM IST

Updated : Nov 25, 2020, 5:58 PM IST

హైదరాబాద్ భోలక్​పూర్​ సమీపంలోని సుప్రీం హోటల్ వద్ద ఎంఐఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సభకు హాజరయ్యారు. కార్యక్రమంలో అక్బరుద్దీన్ ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఎంఐఎంలో చేరిన అజయ్ రిజ్వి తన అనుచరులతో ఊరేగింపుగా వేదిక వద్దకు దూసుకొచ్చారు.

వారిని వారించడానికి ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించినా.. రిజ్వి అనుచరులు నినాదాలు కొనసాగించడం వల్ల అసహనానికి గురైన అక్బరుద్దీన్ వేదికపై నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు తన ప్రసంగంలో పాతబస్తీ​ అభివృద్ధి ఎంఐఎంతోనే సాధ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చట్టసభల్లో తమ ప్రతినిధులు ఉండాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Last Updated : Nov 25, 2020, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.