మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ నిర్వహించారు. మక్కా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు పూర్తి చేసుకున్న అనంతరం ర్యాలీ ప్రారంభించారు. పాతబస్తీలోని పలు కాలనీల నుంచి ర్యాలీగా బయల్దేరిన ముస్లింలు మక్కా మసీదుకు చేరుకున్నారు. అక్కడి నుంచి చార్మినార్, మదీనా మీదుగా మొఘల్ పుర వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.
ముస్లిం మత పెద్దలు ఈ ర్యాలీలో పాల్గొని మిలాద్ ఉన్ నబీ పండుగ సందేశం ఇచ్చారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. అదనపు డీజీ శిఖా గోయల్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ చార్మినార్ వద్ద ఉండి ర్యాలీని పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జహీరాబాద్లో సామూహిక వివాహలు