కరోనా మహమ్మారి విలయం వలస కూలీలపై విరుచుకుపడుతోంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారి స్వస్థలాలకు వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు నడుస్తూ... మరికొందరు వాహనాలను ఆశ్రయిస్తూ... మరికొందరు సైకిళ్లపై వందల కిలోమీటర్లు పయనమై వెళ్తున్నారు.
ఈ క్రమంలో విజయవాడలో ఒక పరిశ్రమ మూత పడిన కారణంగా... అక్కడకు వెళ్లిన వలస కూలీలు సైకిళ్లపై వారి స్వస్థలమైన కోల్‌కత్తా ప్రయాణయ్యారు. సుమారు 52మంది భోగాపురం జాతీయ రహదారి గుండా వెళ్తూ కనిపించారు. బతికేందుకు వేరే మార్గం లేక.. స్వస్థలాలకు చేరడమే మంచిదనుకోని బయల్దేరామన్నారు.
ఇదీ చూడండి : రోజూ 'గ్రీన్ టీ' తాగితే బరువు తగ్గుతారా?