ETV Bharat / state

ఇంటిదారి పట్టిన వలస కూలీలు... కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు

author img

By

Published : Apr 29, 2021, 8:57 AM IST

సికింద్రాబాద్​, కాచిగూడ, హైదరాబాద్​ రైల్వేస్టేషన్లు వలసకూలీలతో కిటికిటలాడుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్​కేసులు భారీగా పెరుగుతున్నందున లాక్​డౌన్​ పెట్టొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదని కార్మికులు ఇంటిదారి పడుతున్నారు.

తెలంగాణలో వలస కూలీలు
హైదరాబాద్​ వార్తలు

రెండోదశలో కొవిడ్​ తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసులు వేల సంఖ్యలో వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో రాత్రి కర్ఫ్యూ విధించారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున లాక్​డౌన్​ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలు ఇంటిబాట పడుతున్నారు. నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లన్నీ కూలీలతో కిక్కిరిసిపోతున్నాయి.

కోల్​కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్​, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలు నగరంలో ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే పలువురికి పనిలేదు. చాలా ప్రాంతాల్లో కొవిడ్​ కేసులు భారీగా వస్తున్నాయి. చాలామంది వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు కూడా పయనమవుతున్నారు. పనులు చేసేందుకు అవసరమైన కూలీలు లేక నిర్మాణ, వ్యాపార రంగాలు కుదేలవుతున్నాయి. కూలీలు లేకపోతే పనులు జరగవని గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు.

గతేడాది లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. ఇప్పటికే చాలామందికి పనిలేదు. మా ఎదుటే చాలామంది కరోనాతో చనిపోతున్నారు. లాక్​డౌన్​ పెట్టారంటే ఇంటికెళ్లేందుకు చాలా కష్టాలు పడాలి. అందుకే ఇక వేరే దారిలేక ముందుగానే వెళ్లిపోతున్నాం. రైళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నాం.- వలస కూలీలు

ఇదీ చూడండి: వ్యాప్తి గొలుసు తెగితేనే కరోనా కట్టడి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.