ETV Bharat / state

కరోనా వేళ వలస బతుకుల వ్యథలు

జీవితం చాలా విచిత్రమైంది. ఎక్కడ పుడతామో తెలియదు. ఎక్కడికి వెళ్తామో తెలియదు. అయినా జీవనాన్ని కొనసాగించాలి. విధి ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్లాలి. కష్టాలు పడాలి. బాధలు అనుభవించాలి. అలానే ఉంది రాష్ట్రంలో వలస కూలీల పరిస్థితి.

migrant labors in telangana
కరోనా వేళ వలస బతుకుల వ్యథాలు
author img

By

Published : Apr 16, 2020, 6:33 AM IST

రాష్ట్రంలో వలసజీవుల ప్రయాణ ప్రయత్నాలు ఆగడం లేదు... మరోపక్క చాలాచోట్ల వారికి నచ్చజెప్పి వెనక్కి పంపడమూ పోలీసులకు తప్పడం లేదు. లాక్‌డౌన్‌ పొడిగింపు ప్రకటన వచ్చిన మంగళవారమే కాదు.. బుధవారమూ ఎలాగొలా ఊర్లకు వెళ్లిపోదామంటూ పిల్లాజెల్లాతో కలిసి కాళ్లీడుకుంటూ రహదారులపై భారంగా నడుస్తున్న వారు పెద్ద సంఖ్యలో కనిపించారు. వలస దైన్యంలో ఇదో పార్శ్వమైతే ఆకలి తీర్చుకోవడానికి రెండు గంటల ముందు నుంచే అన్నదాతలు చేసే సాయం కోసం క్యూలో ఎదురు చూసేవారు.. ఎండకు తట్టుకోలేక అన్నం పంపిణీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లో చెప్పులు పెట్టి తమ వంతు కోసం దీనంగా చెట్టునీడన నిల్చున్నవారు.. ఇలాంటి దృశ్యాలన్నీ ఆ దైన్యానికి మరికొన్ని రూపాలు. రాష్ట్రాలే కాదు పక్కనున్న నేపాల్‌ దేశం నుంచి కూడా తెలంగాణకు అందునా ప్రత్యేకించి హైదరాబాద్‌కు పనుల కోసం వచ్చారు.

పోలీస్‌ స్టేషన్ల వారీగా లెక్కల సేకరణ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలకు రూ.500 నగదు, 12 కేజీల బియ్యం చొప్పున ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారు 3.36 లక్షలమంది ఉన్నట్లు లెక్కతేల్చింది. ఇందులో హైదరాబాద్‌లో 35వేల మంది ఉన్నట్లు సాయం చేసేందుకు ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వం సేకరించిన లెక్కల్లోకి రానివారు అనేకమంది ఉన్నారు. పోలీసు స్టేషన్ల వారీగా కూడా వలస కార్మికులకు సంబంధించిన వివరాలు సేకరించడంలో యంత్రాంగం నిమగ్నమైంది. నిర్మాణ సంస్థల వద్ద అధిక సంఖ్యలో పని చేస్తోన్న కూలీలకు అవసరమైన సాయం చేసే బాధ్యతను వారికే అప్పగించింది.

మరో వైపు ప్రభుత్వం తాను అందించే సాయాన్ని కొనసాగిస్తోంది. బుధవారం 650 మందికి అందించింది. ఈ లబ్ధి పొందిన వారిలో నేపాల్‌ దేశంతో పాటు బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ్‌బెంగాల్‌, హరియాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, అసోం, త్రిపుర తదితర రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్‌లోని గోపాలపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ ఫంక్షన్‌ హాల్‌, కారు పార్కింగు ప్రాంతంలో 280 మంది ఉన్నారు. వీరంతా 16 రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం.

జ్వరాలు వస్తే ఏం చేయాలో... భయమేస్తోంది

నిర్మాణ రంగంలోనూ, ఇతర చోట్ల వీరి బాగోగులు చూసుకోవాల్సిన వారు క్రమంగా పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం, అద్దెలకు రూములు తీసుకొని ఉంటున్న చోట బాడుగ కట్టే పరిస్థితి లేక ఎలాగైనా ఊరెళ్లిపోదామని ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మధ్యప్రదేశ్‌కు చెందిన 30 మంది వలస కూలీలు తమ ప్రాంతానికి వెళ్తుండగా కొత్తగూడ వద్ద పట్టుకొని తిరిగి వారు పని చేసే ప్రాంతానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. నార్సింగ్‌ పరిధిలో 200 మందిని చెక్‌పోస్టులు, టోల్‌గేట్‌ వద్ద పట్టుకొని వారున్న నిర్మాణ ప్రాంతాలకు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇలాగే వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దాదాపు 600 మంది తీసుకొచ్చారు. నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ వారు రోజూ వందల మందికి రెండు పూటలా అన్నం పెడుతున్నారు. ఇక్కడ క్యూలో కనిపించిన వారిలో అత్యధికులు వలస జీవులే. ‘‘జ్వరాలు వస్తే ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. సబ్బులు ఇతర అవసరాలకు డబ్బుల్లేవు. పిల్లలు చాక్లెట్‌ కావాలని అడిగినా కొనిచ్చే పరిస్థితి లేదు’’ అని మధ్యప్రదేశ్‌లోని బాలాపూర్‌ ప్రాంతానికి చెందిన రేవతి వాపోయింది. రాజ్‌భవన్‌ సమీపంలో ప్రతి రోజు అన్నం పెడుతున్నారు ఇక్కడ 11 గంటల నుంచే క్యూలో ఉంటున్నారు. ఎండకు తట్టుకోలేక క్యూలో చెప్పులు పెట్టి ఎదురుచూస్తుండడం కనిపించింది.

యాభైకి పైగా ప్రాంతాల్లో సమస్య

హైదరాబాద్‌లో సుమారు 50కి పైగా ప్రాంతాల్లో వలస కూలీలు ఆహార సమస్యను ఎదుర్కొంటున్నట్లు సంబంధిత అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లో ఉన్న సమస్య, వారికి ఏం సరఫరా చేయాలో సూచిస్తూ ఆయా ప్రాంతాలకు ఇన్‌ఛార్జులుగా ఉన్న నగర పాలక సంస్థ అధికారులకు సమాచారమిచ్చారు.

ఇవీచూడండి: కంటైన్మెంట్​ జోన్​ ప్రజలకు అండగా ఉంటాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.