ETV Bharat / state

ముక్కిపోతున్న మధ్యాహ్న బియ్యం.. సమన్వయలోపమే శాపం!! - midday meals wasted

ఓవైపు విద్యాసంస్థలు మూతబడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని పరిస్థితి.. మరోవైపు ఆ కార్యక్రమం కోసం కేటాయించిన బియ్యం పాఠశాలల్లో ముక్కిపోతున్న దుస్థితి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందల క్వింటాళ్ల బియ్యం ఎందుకు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కూడా విద్యాశాఖాధికారులు మేల్కొనడం లేదు.

midday meals wasted in telangana
ముక్కిపోతున్న మధ్యాహ్న బియ్యం.. సమన్వయలోపమే శాపం!!
author img

By

Published : May 13, 2021, 12:12 PM IST

పాఠశాలలు మూతపడిన వెంటనే ఆయా బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌ దుకాణాలకు తరలించాలి. విద్య, పౌరసరఫరాల శాఖల మధ్య సమన్వయం కొరవడి నెలన్నరగా బస్తాలు పేరుకున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఉపాధ్యాయులు సైతం పాఠశాలలకు వెళ్లడం లేదు. దీనివల్ల బియ్యం ఎలా ఉన్నాయో కూడా అంతుచిక్కకుండా మారింది. ముఖ్యంగా నగర శివారు గ్రామాల్లో పందికొక్కుల పాలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, బియ్యం తరలించే ఏర్పాట్లు చేయలేదు. వాటిని రేషన్‌ దుకాణాలకు తరలించే విషయంలో రెండు శాఖలు తాత్సారం చేస్తున్నాయి. ‘‘నిత్యం ప్రతి విద్యార్థికి 150 గ్రాముల బియ్యం చొప్పున ఇవ్వాలి. ఆ మేరకు లెక్కగట్టి సెలవుల్లో విద్యార్థులకే నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి వివరించాం. విధాన పరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఆ దిశగా ప్రభుత్వం యోచన చేయడం లేదు.’ అని ప్రధానోపాధ్యాయుడు ఒకరు చెప్పారు.

3500 క్వింటాళ్లు.. కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా మార్చి మూడో వారం నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. తొలుత ఫిబ్రవరి ఒకటి నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా, మార్చి 1 నుంచి 6-8 తరగతుల విద్యార్థులను పాఠశాలలకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం కోసం ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి బియ్యాన్ని ముందుగానే పాఠశాలలకు తీసుకువచ్చారు. అనుకోకుండా కరోనా రెండో దశ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిలిచిపోయింది. ఇందుకు కేటాయించిన బియ్యం పాఠశాలల్లోనే ఉండిపోయాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 576 పాఠశాలల్లో దాదాపు 3500 క్వింటాళ్ల బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. ప్రస్తుతం కరోనా రెండో దశ దృష్ట్యా పాఠశాలలు ఎప్పటికీ తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. నిల్వలు నెలల తరబడి ఉంచితే ముక్కిపోయి వృథా కానున్నాయి.

గతేడాది పాడైనా.. మళ్లీ అదే తీరు.. గతేడాది సైతం మార్చిలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అప్పట్లోనూ బియ్యం నిల్వల తరలింపునకు అధికారులు చొరవ తీసుకోకపోవడంతో దాదాపు ఆరేడు నెలలు పాఠశాలల్లోనే పేరుకుపోయి ముక్కిపోయాయి. చాలాచోట్ల పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 1.78 లక్షల కిలోల బియ్యం పాడయ్యాయి. ఆలస్యంగా మేల్కొన్న విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖాధికారులు వాటిని వేలం వేసి దాణా కోసం విక్రయించాయి. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. పాఠశాలల్లో బియ్యం నిల్వలను వెనక్కి తీసుకుని రేషన్‌ దుకాణాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రధానోపాధ్యాయుల సంఘం మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ 2.0: రవాణా శాఖ స్లాట్ల బదలాయింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.