ETV Bharat / state

మీ చరవాణే.. మీ మెట్రో టికెట్​ - మెట్రో తాజా వార్త

మీ చరవాణే మీ టికెట్‌గా మారితే ఎలా ఉంటుంది. ప్రయాణికుల టికెటింగ్​ విధానాన్ని మరింత సులభతరం చేయడానికి మన మెట్రోలో క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ విధానాన్ని మెట్రో అధికారులు అమలులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఎక్కడి నుంచైనా మీ టికెట్​ను తీసుకోవచ్చు ఒక్క స్మార్ట్​ మొబైల్​ మీ చేతిలో ఉంటే చాలు..!

metro-train-tickets-available-in-mobile
మీ చరవాణే.. మీ మెట్రో టికెట్​
author img

By

Published : Dec 11, 2019, 12:15 PM IST

మెట్రోరైలు ప్రయాణికుల టికెటింగ్‌ విధానం మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణిస్తున్న వారిలో 60 శాతం మంది మెట్రో స్మార్ట్‌ కార్డు వినియోగిస్తుంటే.. మిగతావారు బుకింగ్‌ కౌంటర్లలో టోకెన్‌లు కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నారు. రద్దీ వేళల్లో కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరుతున్నారు. స్టేషన్‌కు రాకుండానే టికెట్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం రాబోతుంది. ఎక్కడి నుంచైనా మొబైల్‌లోనే టికెట్‌ తీసుకునేలా కొత్త యాప్‌ను ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు అభివృద్ధి చేస్తోంది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు రూపంలో టికెట్‌ మొత్తాన్ని చెల్లించవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ రూపంలో టికెట్‌ మీ మొబైల్‌లో కనిపిస్తుంది. ప్రవేశ మార్గం వద్ద క్యూఆర్‌కోడ్‌ చూపించి లోపలికి వెళ్లవచ్చు. ఈ సేవలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో వర్గాలు తెలిపాయి. దిల్లీలో అయితే ఈ విధానంలో ఒకేసారి ఆరు టికెట్లు తీసుకునే అవకాశం ఉంది. మన దగ్గర ఎంతమంది తీసుకోవచ్చు అనేది నెలాఖరుకు స్పష్టత వస్తుంది.

మీ చరmetro-train-tickets-available-in-mobileవాణే.. మీ మెట్రో టికెట్​
మీ చరవాణే.. మీ మెట్రో టికెట్​

ఎలా పనిచేస్తుందంటే?
* స్టేషన్‌కు రాకుండానే మొబైల్‌ నుంచి యాప్‌లో టికెట్‌ తీసుకోవచ్చు.
* ఏ స్టేషన్‌లో ఎక్కి ఏ స్టేషన్‌ దిగుతారో వివరాలు చెబితే అంత దూరానికి టికెట్‌ క్యూఆర్‌ కోడ్‌ రూపంలో యాప్‌లో కనిపిస్తుంది.
* స్టేషన్‌కు చేరుకుని క్యూఆర్‌ కోడ్‌ గుర్తించే ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌(ఏఎఫ్‌సీ) గేట్ల వద్ద చూపించగానే తెరుచుకుంటుంది.
* బయటకొచ్చేటప్పుడు మొబైల్‌ యాప్‌లోని క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తేనే గేట్లు తెరుచుకుంటాయి.
* ప్రయాణించి బయటకొచ్చాకనే మరో టికెట్‌ను బుక్‌ చేసుకునే వీలుంటుంది. ఒక్కోసారి క్యూఆర్‌ కోడ్‌ చూపకుండానే ముందువారితో గేటులోంచి కొందరు బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ టికెట్‌ అర్ధరాత్రి తర్వాత ఎగ్జిట్‌ అయినట్లు పరిగణనలోకి తీసుకుంటారు.
* క్యూఆర్‌కోడ్‌ టికెట్‌ ఆ రోజుకే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ప్రయాణించకపోతే మురిగిపోతుంది.

5000 వీడియోలు..
క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ కంటే ముందే ప్రయాణికులకు అంతరాయం లేని వినోద సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాగోల్‌ నుంచి రాయదుర్గం, మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు తిరుగుతున్న 48 మెట్రోరైళ్లలో లోకల్‌ వైఫై సహాయంతో డాటా లేకుండానే వీడియోలు అంతరాయం లేకుండా వీక్షించవచ్చు. మూడు నిమిషాల్లోనే సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 5000 వీడియోలు అందుబాటులోకి ఉన్నాయి. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకుని ఆ తర్వాత చూసుకోవచ్చు. షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్స్‌ ఒప్పందం చేసుకున్న జీ5, ఫ్రిప్లే కంటెంట్‌ వరకు మాత్రమే ఇది పనిచేస్తుంది. భవిష్యత్తులో మరిన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ఇందులో జోడించబోతున్నారు. మెట్రోరైళ్లతో పాటు ఎంపిక చేసిన స్టేషన్లు నాగోల్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ ఈస్ట్‌, బేగంపేట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, మియాపూర్‌ స్టేషన్లలోని ఫ్లాట్‌ఫామ్స్‌పైన ఇది పనిచేస్తుంది. క్రమంగా స్టేషన్‌లోని కింది అంతస్తులోనూ పనిచేసేలా చేయనున్నారు.

సేవలతోపాటు బాదుడు..
మెట్రోలో ఎప్పటికప్పుడు కొత్త సేవలు కల్పిస్తూనే.. క్రమంగా ప్రయాణికులపై భారం మోపుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. మొదట ఉచిత పార్కింగ్‌ సదుపాయం కల్పించి.. ఇప్పుడేమో వాటికి రుసుములు వసూలు చేస్తున్నారు. వీరి బాదుడుకు శుక్రవారం రాత్రి క్రికెట్‌ అభిమానులు షాక్‌ తిన్నారు. మ్యాచ్‌ ముగిసే వరకు మెట్రో సేవలు అంటే అభిమానులు సంబరపడ్డారు. మ్యాచ్‌ అయిపోయాక స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి తిరుగుప్రయాణం చేసిన ప్రయాణికులు మెట్రో ధరలకు ఖంగుతిన్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా రూ.60 వసూలు చేశారు. ముందు చెప్పకుండా ఇలా ప్రయాణ టికెట్‌ ధరలు పెంచడం ఏంటి అని ప్రయాణికులు సిబ్బందిని నిలదీశారు. దీనిపై మెట్రోరైలు ఎం.డి. ఎన్వీఎస్‌రెడ్డి స్పందిస్తూ.. ఇతర నగరాల్లో రూ.100 తీసుకుంటున్నారని అన్నారు. అలాగే మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
* జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గాన్ని జనవరి ఆఖరు వరకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
* రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ ఎప్పుడనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
* స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్య లేదు. నాలుగువేల ద్విచక్రవాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశాం. చాలా స్టేషన్ల వద్ద కేటాయించిన స్థలాలు నిండడం లేదు.
* మెట్రోరైలు మూడు నుంచి ఆరు కార్లకు పెంచుకోవచ్చు. అలా చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ అవసరం లేదు. కొన్ని గంటలు మాత్రమే ఉండే రద్దీని తట్టుకునేందుకు మెట్రో రైలు వేగం పెంచడంతో పాటూ మూడు నిమిషాలకో మెట్రో నడుపుతున్నాం.
* హైదరాబాద్‌ మెట్రో లాభాల్లోకి వచ్చేందుకు ఏడేళ్లు పడుతుంది. ఏటా రూ.1300 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

metro-train-tickets-available-in-mobile
మీ చరవాణే.. మీ మెట్రో టికెట్​

ఇదీ చూడండి: ఈ నెల 17న ముగియనున్న వార్డుల పునర్విభజన... సంక్రాంతి తర్వాతే పురపోరు

West Midnapore (West Bengal), Dec 11 (ANI): A two headed snake was found in WB's West Midnapore. It was found in the Ekarukhi village of Belda forest range. The species of snake is identified as 'Naja Kaouthia'. Speaking to ANI on the matter, Zoologist Soma Chakraborty said, "The species of the two-headed snake is 'Naja Kaouthia', which is locally known as 'Keute' or in hindi 'Kala Naag'. The venom of this snake is neurotoxic."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.