హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 నిమిషాలకు నగరంలోని మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
ఇటీవల వరకు ఉదయం 7 గంటలకు మెట్రో ప్రారంభమయ్యేది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఇక నుంచి 30 నిమిషాల ముందుగా అందుబాటులోకి తెచ్చినట్లు ఎండీ తెలిపారు. రాత్రి సమయంలో ఎలాంటి మార్పులేదు. గతంలోలాగే చివరి ట్రైన్ రాత్రి 9.30 నిమిషాలుగా ఉంది. రేపటి నుంచి నగరంలోని భరత్‌నగర్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరచుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నుంచి ఈ మూడు స్టేషన్లు మూసి ఉంచిన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: గ్రేటర్ పోరు: మేయర్ పీఠం దక్కేదెవరికి... క్షణక్షణం అప్డేట్స్ మీకోసం