ETV Bharat / state

Hyderabad Metro News: నుమాయిష్‌ రద్దీ.. హైదరాబాద్‌ మెట్రో వేళల్లో మార్పులు - తెలంగాణ న్యూస్

Hyderabad Metro Services Extended on Occasion of Numaish: నుమాయిష్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో సేవల సమయం పొడిగించారు. సమాయాన్ని అర్ధరాత్రి ఒంటిగంట వరకు పొడిగించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. టెర్మినల్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభం కానున్న చివరి రైళ్లు.. గంటలోపు గమ్యస్థానానికి చేరుకుంటాయని తెలిపారు.

Hyderabad Metro Services Extended
Hyderabad Metro Services Extended
author img

By

Published : Jan 3, 2023, 5:26 PM IST

Hyderabad Metro Timings Extend on Occasion of Numaish: నుమాయిష్‌ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రోసేవలను పొడిగించినట్లు చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌-మియాపూర్‌, నాగోల్‌-రాయదుర్గ్‌ మార్గాల్లో రాత్రి ఒంటిగంట వరకు మెట్రోసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. టెర్మినల్‌ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ మార్పులు ఫిబ్రవరి 15 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని అన్నారు. నుమాయిష్‌ రద్దీ దృష్ట్యా గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌లో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల సంఖ్యను పెంచినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సాధారణంగా ఉన్న నాలుగు కౌంటర్లతోపాటు మరో రెండు కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేశామన్నారు.

నుమాయిష్‌ మస్నూవత్‌ ఇ ముల్కీ.. అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మేళా. ఏటా జనవరి 1 నుంచి 45 రోజులపాటు హైదరాబాద్‌లో జరుగుతుంది. జమ్ముకశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ కంపెనీలు, స్థానిక సంస్థల ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్‌, చేనేత వస్త్రాలు, ఎలక్ట్రికల్‌ పరికరాలు ఇలా అన్నీ ఇక్కడ కొలువుదీరిన స్టాళ్లలో లభిస్తాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.