ETV Bharat / state

దయనీయంగా విద్యుత్​ మీటర్​ రీడింగ్​ కార్మికుల జీవితాలు - npdcl latest news

అసలే అరకొర జీతాలతో నెట్టుకొస్తున్నారు. దీనికితోడు కరోనా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కొవిడ్​తో మీటర్ రీడింగ్ నిలిపివేయడం వల్ల వాళ్ల జీతాలూ ఆగిపోయాయి. ఇప్పుడు అర్ధాకలితో జీవితం వెళ్లదీస్తున్న మీటర్ కార్మికులపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

meter reading labours problems in telangana
దయనీయంగా విద్యుత్​ మీటర్​ రీడింగ్​ కార్మికుల జీవితాలు
author img

By

Published : Jul 2, 2020, 10:48 PM IST

ప్రతీ నెల ఇంటింటికి తిరిగి మీటర్ బిల్లులు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ప్రైవేట్ మీటర్ కార్మికులను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీడీసీఎల్, ఎన్​పీడీసీఎల్ పరిధిలో కలిపి మొత్తం 1,800ల మంది మీటర్ కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యుత్ శాఖ రెండు నెలలపాటు విద్యుత్ బిల్లులను నిలిపివేసింది. కార్మికులకు ఏప్రిల్, మే నెలలో నెలకు రూ.3 వేల చొప్పున ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు. అధికారులు ఆదేశించినా గుత్తేదారులు జీతాలు ఇవ్వకపోవడం వల్ల మీటర్ రీడింగ్ కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇంటి అద్దె కట్టలేక, నిత్యావసర సరకులు కొనుగోలు చేయలేకపోతున్నారు. అప్పులతో పస్తులుంటున్నారు. పెండింగ్​లో ఉన్న జీతాలు ఇస్తామనడం వల్ల మీటర్ రీడింగ్ ప్రారంభించామని కార్మికులు చెబుతున్నారు.

ప్రాణాలు పణంగా పెట్టి విధులు

అసలే హైదరాబాద్​లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని.. ఇలాంటి సమయంలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియడం లేదంటున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఒకవేళ కరోనా సోకితే ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఒక్క మీటర్ రీడింగ్ తీస్తే కేవలం రూ.2 మాత్రమే చెల్లిస్తారని.. నెలలో 10 నుంచి 15 రోజులు మాత్రమే పని ఉంటుందని వాపోతున్నారు. తమకు బీమా కల్పించాలని, తమను ఆర్టిజన్​లుగా గుర్తించాలని విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పెండింగ్​లో ఉన్న ఏప్రిల్, మే నెలల జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

దయనీయంగా విద్యుత్​ మీటర్​ రీడింగ్​ కార్మికుల జీవితాలు

ఇవీ చూడండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.