ETV Bharat / state

'జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో... మా మద్దతు తెరాస పార్టీకే..' - GHMC Elections 2020

తెలంగాణ రికగ్నైజ్డ్​ పాఠశాలల అసోసియేషన్​ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ను కలిశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తమ మద్దతు తెరాసకే ఉంటుందని స్పష్టం చేశారు.

Members of the Telangana Recognized Schools Association met Minister Talsani Srinivas Yadav
'జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో... మా మద్దతు తెరాస పార్టీకే..'
author img

By

Published : Nov 23, 2020, 5:58 PM IST

హైదరాబాద్​ నగర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్​ నాయకత్వంలోనే సాధ్యమని తెలంగాణ రికగ్నైజ్డ్​ పాఠశాలల అసోసియేషన్​ హైదరాబాద్​ నగర అధ్యక్షులు ఉమామహేశ్వర్​రావు అన్నారు. సోమవారం వెస్ట్​మారేడ్​పల్లిలోని నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను తెలంగాణ రికగ్నైజ్డ్​ పాఠశాలల అసోసియేషన్ సభ్యులు కలసి జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసకే తమ మద్దతును ప్రకటించారు.

ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా... హైదరాబాద్​ మరింత అభివృద్ధి జరగాలన్నా... అది కేసీఆర్​తోనే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇంకా పెండింగ్​లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారనే నమ్మకం తమకు ఉన్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ.. అభివృద్ధి కోసం పనిచేసే.. తెరాస పార్టీని గెలిపించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు.

కొన్ని పార్టీల నేతలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తారని మంత్రి తలసాని ధ్వజమెత్తారు. తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం నిరంతరం ప్రజల మధ్యనే ఉంటారని గుర్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.