సింగరేణిలో సంస్థలో రేపటి నుంచి మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. 45 వేల మంది కార్మికుల్లో ఇప్పటికే 16 వేల మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తిచేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వ సహాయంతో మిగిలిన 29 వేల మందికి 10 రోజుల్లోగా వ్యాక్సినేషన్ పూర్తికి భారీ ఏర్పాట్లు చేశామని సీఎండీ తెలిపారు.
ఈ ఆదివారంతో పాటు.. రానున్న రెండు ఆదివారాల్లో 13, 20వ తేదీల్లో మెగా క్యాంప్లు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాక్సిన్లు కార్మికులకు పూర్తిగా అందుబాటులో ఉండేవిధంగా సింగరేణి ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాళ్లలో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. డైరెక్టర్ల పర్యవేక్షణలో మెగా వ్యాక్సినేషన్ నిర్వహణ కొనసాగుతుందని... ఈ అవకాశాన్ని కార్మికులందరూ వినియోగించుకోవాలని సీఎండీ సూచించారు.
ఇదీ చదవండి: KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి