స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు రంగంలో చమురు, ఇంధనం వెలికితీసే హైడ్రాలిక్ రిగ్గులను తయారు చేసిన సంస్థగా హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఘనత సాధించింది. 6వేల కోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారీ ఆర్డర్‌ను ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ నుంచి దక్కించుకుంది.
గుజరాత్ రాష్ట్రం ఆహ్మదాబాద్ లోని కల్లోల్ చమురు క్షేత్రంలో మొదటి రిగ్గు డ్రిల్లింగ్ ప్రారంభించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ రిగ్గులు 40 సంవత్సరాల పాటు పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. రాజమండ్రి చమురు క్షేత్రంలో 2 రిగ్గులను అసెంబ్లింగ్ దశలో ఉన్నాయని పేర్కొంది.
ఇదీ చదవండి:మీ బాబాయ్ హత్యపై మేం ప్రమాణం చేస్తాం.. మీరు చేస్తారా?: లోకేశ్