Conflict At Congress Meeting: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై హైదరాబాద్ దస్పల్లా హోటల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. మెదక్, సంగారెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో చర్చించారు. ఈక్రమంలోనే మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, సంజీవ్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ ఓటమికి మీరంటే మీరు కారణమని ఒకరినొకరు దూషించుకున్నారు.
ఈక్రమంలో కొద్దిసేపు సమావేశం రసాభాసగా మారింది. గొడవపడుతున్న ఆ ఇద్దరు నేతలకు ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, దామోదర రాజనర్సింహ సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఇక్కడ మీడియా ప్రతినిధులున్నారని ఏదైనా ఉంటే బయట చూసుకుందామని దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మన రాష్ట్రంలో రూట్ మ్యాప్ ఖరారైంది. హైదరాబాద్ నగర నడిబొడ్డు నుంచే.. ఈ యాత్ర సాగేట్లు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 7 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 375 కిలోమీటర్ల మేర 14 రోజుల పాటు రాహుల్ జోడో యాత్ర సాగనుంది.
ఇవీ చదవండి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై దృష్టి సారించిన కాంగ్రెస్