Medtronic Company Investments in Telangana : రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వైద్య పరికరాలను తయారు చేసే మెడ్‌ట్రానిక్ సంస్థ.. రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. న్యూయార్క్‌లో సంస్థ ప్రతినిధులను కలిసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మెడ్ ట్రానిక్స్ సంస్థకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా బలోపేతం చేసేందుకు ఈ సంస్థ కార్యకలాపాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన వివరించారు.
ఇటీవలే మంత్రి కేటీఆర్ లండన్‌లో పర్యటించారు. ఈ క్రమంలో పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు సంస్థలు కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వచ్చే సంవత్సర కాలం నాటికి ఈ కేంద్రం ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది.
ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్..: హైదరాబాద్‌లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని.. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ ప్రకటించింది. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో డాన్జ్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరో రసాయన పరిశ్రమ క్రోడా.. జీనోమ్ వ్యాలీలో గ్లోబల్ టెక్నికల్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే ఇన్‌క్రెడిబుల్ హస్క్ సంస్థ..: ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే ఇన్‌క్రెడిబుల్ హస్క్ సంస్థ.. రూ.200 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో పరిశ్రమ పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇన్‌క్రెడిబుల్ హస్క్ సీఈవో కీత్ రిడ్జ్‌వే నేతృత్వంలోని బృందం.. కేటీఆర్‌తో సమావేశమై ఇందుకు సంబంధించిన చర్చలు జరిపారు. ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్.. ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇండియా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్, పొట్టు ప్యాలెట్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొల్పబోయే ప్రతిపాదిత తయారీ యూనిట్ సంవత్సరానికి 1000 మిలియన్ టన్నుల వరకు బయో ప్యాలెట్‌లను ఉత్పత్తి చేస్తుందని సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌కు వివరించారు.
ఇవీ చదవండి : KTR London Tour : 'భారతదేశంలో విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ'
Action Illegal Liquor in TS : 'ఇతర రాష్ట్రాల మద్యం తెస్తే ఊరుకునే ప్రసక్తే లేదు'
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రిజిజు తొలగింపు.. మేఘవాల్‌కు బాధ్యతలు
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే.. కాంగ్రెస్ అధికార ప్రకటన