హైదరాబాద్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ అంకుర్ ఆస్పత్రిలో చేరిన ఓ చిన్నారి వైద్యం వికటించి మృతి చెందింది. నిన్న కడుపునొప్పితో రమ్యను అంకుర్ ఆస్పత్రిలో చేర్పించామని తల్లిదండ్రులు తెలిపారు
వైద్యులు హెవీ డోస్ ఇంజక్షన్లు ఇవ్వడం కారణంగానే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమ్యశ్రీ చావుకు కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించి.. తమకు న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళనకు దిగారు.
ఇదీ చూడండి : అంబులెన్స్‌లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి