ETV Bharat / state

ప్రీతి ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఆ హానికారక ఇంజెక్షన్​ ఏంటి..? - Medico Preethi suicide latest news

Preethi Suicide Case Latest Updates: వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో.. ఆమె మృతికి కారణమైన ఆ హానికారక ఇంజెక్షన్ ఏంటనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై రక్త పరీక్షల్లోనూ స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.

preethi
preethi
author img

By

Published : Mar 6, 2023, 9:08 AM IST

Preethi Suicide Case Latest Updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడానికి కారణమైన హానికారక ఇంజెక్షన్‌ ఏంటనే అంశం ఉత్కంఠను రేపుతోంది. ఆమె మరణించి వారం రోజులు గడిచినా.. ఈ విషయంపై ఇంకా స్పష్టత కొరవడింది. హైదరాబాద్‌ నిమ్స్‌ వైద్యుల తాజా నివేదికల్లో సైతం దీనికి సంబంధించిన విషయంపై స్పష్టత రాలేదు.

గత నెల 22న ప్రీతి బలవన్మరణానికి యత్నించిన విషయం తెలిసిందే. సైఫ్‌ వేధింపులు భరించలేక ఆమె హానికారక ఇంజెక్షన్‌ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. తొలుత వెంటిలేటర్‌పై.. తర్వాత ఎక్మో యంత్రంపై వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. దీంతో గత నెల 26న ప్రీతి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆరోపణలు?: ప్రీతిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే నిమ్స్ వైద్యులు ఆమె శరీరం నుంచి రక్త నమూనాలను సేకరించారు. అందులో విషపు ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అని తేల్చేందుకు చికిత్స క్రమంలోనే పది రకాల పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏ హానికారక ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల ప్రీతి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందనేది తాజాగా వెలువడిన నివేదికల్లోనూ తేలలేదు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల్లోనూ కొన్ని హానికారక ఇంజెక్షన్ల గురించి తేలే అవకాశాలు తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు.

సైఫ్​ను వివిధ కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు: మరోవైపు ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్​ను పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న విధంగా చిత్రీకరించాడా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు.

హెచ్​వోడీ నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు: ప్రీతి ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రీతిని సైఫ్ మానసికంగా వేధింపులకు గురి చేయడం నిజమేనని ర్యాంగింగ్ నిరోధక కమిటీ పేర్కొంది. ప్రీవెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన ఒక వివాదం ఒక్కటే వీరి మధ్య వివాదానికి కారణం కాదని తెలిపింది. వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన అనస్థీషియా వైద్య విభాగం హెచ్​వోడీ నాగార్జునరెడ్డి కూడా సైఫ్​ది తప్పేనని అంగీకరించారు. దీని ఆధారంగా అనస్తీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డిని.. భూపాలపల్లి వైద్య కళాశాల ప్రొఫెసర్​గా బదిలీ చేసింది. మరోవైపు తన కూతురిది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికి హత్యేనని ప్రీతి తండ్రి ధరావత్​ నరేందర్ ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న విధంగా చిత్రీకరించాడా

పోలీసుల కస్టడీలో సైఫ్​.. హెచ్​వోడీ నాగార్జునరెడ్డిపై వేటు

మెడికల్ కాలేజీలపై గవర్నర్, హరీశ్​రావు మధ్య ట్వీట్ వార్

ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. తల్లిదండ్రులను ఎదురించి మరీ ఒక్కటైన జంట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.