ETV Bharat / state

నర్సింగ్ ఉద్యోగాలు పారదర్శకంగా చేపడుతాం: మంత్రి ఈటల - హైదరాబాద్ తాజా సమాచారం

నర్సింగ్ ఉద్యోగాల నియామకాలను అత్యంత పారదర్శకంగా చేపడుతామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఒప్పంద పద్ధతిలో డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వారికి వెయిటేజీ విషయంలో కోర్టు నుంచి స్పష్టత వచ్చిందని తెలిపారు. పొరుగు సేవల వారికి ఇదీ వర్తించవని అన్నారు.

medical  Minister etela rajender rejects allegations on narsing posts
నర్సింగ్ ఉద్యోగాలు పారదర్శకంగా చేపడుతాం: మంత్రి ఈటల
author img

By

Published : Nov 12, 2020, 4:10 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపడుతున్న నర్సింగ్ ఉద్యోగాల నియామకాలను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చేపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ఒప్పంద పద్ధతిలో డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వారికి వెయిటేజీ విషయంలో కోర్టు నుంచి స్పష్టత వచ్చిందని తెలిపారు. పొరుగు సేవల కింద పని చేసేవారికి ఇది వర్తించదని మంత్రి పేర్కొన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా నియామకాలు చేపడతామని ఈటల వెల్లడించారు.

ఇదీ చూడండి:'ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.