Telangana Medical and Health Day Today : దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆరోగ్య దినోత్సవ సంబరాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీ స్థాయి నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రిలో వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దశాబ్ది పేరుతో నూతన బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Telangana Decade Celebrations : 32 ఏకరాల్లో 15 వందల 71 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకోనున్న నూతన బ్లాక్ ద్వారా 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. నూతన బ్లాక్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నందున.. నిమ్స్‌లో ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
Health Day In Telangana Decade Celebrations : మరోవైపు ఆరోగ్య దినోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి సర్కారు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం 277 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పథకం ఇప్పటికే రాష్ట్రంలో 9 జిల్లాల్లో అమలవుతుండగా.. న్యూట్రిషన్ కిట్లు తీసుకున్న మహిళల్లో రక్తహీనత తగ్గుతోందని గుర్తించిన సర్కారు ఆరోగ్య దినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కిట్ల పంపిణీ చేపట్టనుంది. నిమ్స్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని మిగిలిన 24 జిల్లాలకు విస్తరించనున్నారు. ఈ సందర్భంగా ఆరుగురు గర్భిణీలకు సీఎం కేసీఆర్ కిట్స్ అందించనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 6.8 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరే అవకాశం ఉంది.
Decade Celebrations In Telangana : దశాబ్ది ఉత్సవాలను వైద్యారోగ్యశాఖ సాధించిన వృద్ధికి నిదర్శనంగా నిలపాలని మంత్రి హరీశ్‌రావు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అర్బన్ సెంటర్లలో భారీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలలో ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది సహా, వైద్యారోగ్య శాఖ సిబ్బంది హాజరుకానున్నారు.
Health Day Celebrations In Telangana : గత తొమ్మిదేళ్లలో జిల్లాలో వైద్య ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులు, సాధించిన అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు వంటి అంశాలు ప్రజలకు తెలిపేలా కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ సాధించిన విజయాలను వివరిస్తూ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించటంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సైతం ఆరోగ్య శాఖ సత్కరించనుంది.
ఇవీ చదవండి: