తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత, వ్యర్థాల తొలగింపునకు మీడియాకు అనుమతి ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పనులను రహస్యంగా చేస్తున్నారని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేశాయి.
ఎట్టకేలకు ప్రభుత్వం సచివాలయ పనుల పరిశీలనకు మీడియాకు అనుమతి ఇచ్చింది. కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం వల్ల తగు జాగ్రత్తల నడుమ అధికారులే ఆ ప్రాంతాన్ని దగ్గరుండి చూపించారు. కూల్చివేత జరుగుతున్న తీరు, వ్యర్థాల తొలగింపు తదితర అంశాలను మీడియా ప్రతినిధులు క్షుణ్ణంగా చిత్రీకరించారు.