ETV Bharat / state

కరోనా సోకిన మరో 12 మంది జర్నలిస్టులకు మీడియా అకాడమీ సాయం - జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఛైర్మన్​ అల్లం నారాయణ ఆర్ధిక సాయం

కరోనా బారిన పడిన మరో 12 జర్నలిస్టులకు రూ. 20 వేలు, హోం క్వారంటైన్​లో ఉన్న ఆరుగురికి రూ10వేల చొప్పున అందజేశామని రాష్ట్ర మీడియా అకాడమి ఛైర్మన్​ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు అకాడమీ నిధుల నుంచి 15 లక్షల 60 వేల రూపాయలు కరోనా సోకిన జర్నలిస్టులకు వారివారి ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు.

media academy chairman allam narayana announced financial aid to the journalists
కరోనా సోకిన మరో 12 మంది జర్నలిస్టులకు మీడియా అకాడమీ సాయం
author img

By

Published : Jun 17, 2020, 7:20 PM IST

కరోనా బారిన పడ్డ మరో 12 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున, హోంక్వారైంటైన్​లో ఉన్న ఆరు మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున మొత్తం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు రాష్ట్ర మీడియా అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆయా పాత్రికేయుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్​లు వచ్చిన 68 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున రూ. 13 లక్షల 60 వేలు ఆర్థిక సహాయం అందజేశామని నారాయణ పేర్కొన్నారు.

హోంక్వారైంటైన్​లో ఉన్న 20 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఇప్పటి వరకు మొత్తం 15 లక్షల 60 వేల రూపాయలను అకాడమీ నిధుల నుంచి అందించామని తెలిపారు. కరోనా బారిన పడినా, క్వారంటైన్​లో ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వ వైద్యులు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులను అకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జర్నలిస్టులు తమ వివరాలను రాష్ట్ర మీడియా ఛైర్మన్ వాట్సప్ నంబర్ 8096677444కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్​ను 9676647807 నంబర్​ ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: కామారెడ్డి జిల్లాలో సీఎస్ కాన్వాయ్​ని అడ్డుకున్న రైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.