భాగ్యనగరంలో కొత్తగా మరో 13 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆ 13 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున, హోంక్వారంటైన్లో ఉన్న 11 మందికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 3.70 లక్షల ఆర్థిక సహాయం చేశామన్నారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన 81 మంది జర్నలిస్టులకు రూ. 20 వేల చొప్పున రూ. 16.20 లక్షలను అకాడమీ తరఫున ఇచ్చామన్నారు.
హోంక్వారంటైన్లో ఉన్న 31 మందికి రూ. 10 వేల చొప్పున రూ. 3.10 లక్షలను ఆర్థిక సహాయంగా అందించామని తెలిపారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టులను అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలన్నారు. తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వాట్సాప్ నంబర్- 8096677444 కు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నం. 9676647807 లో సంప్రదించవచ్చన్నారు.
ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్