ETV Bharat / state

ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్‌కు మెదక్‌ కలెక్టర్‌ నివేదిక - eetala land allegations latest news

రాష్ట్రంలో తీవ్రదుమారం రేపుతున్న మెదక్‌ జిల్లా అచ్చంపేట భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణికి చెందిన హేచరీస్‌ ఆధీనంలో.. సీలింగ్‌, అసైన్డు భూములున్నట్లు అధికారులు తేల్చారు. మొత్తం 66 ఎకరాల భూముల వారి ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ వెల్లడించారు.

eetala land allegations
eetala land allegations
author img

By

Published : May 2, 2021, 4:28 AM IST

రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ భార్య పేరిట ఉన్న హేచరీస్‌ ఆక్రమణలో 66 ఎకరాల సీలింగ్‌, అసైన్డు భూములు ఉన్నట్లు రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు గుర్తించారు. తమ భూములను ఈటల కబ్జా చేశారంటూ రైతులు చేసిన ఫిర్యాదుతో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించగా మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హాకీంపేట గ్రామాల పరిధిలో శనివారం రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు సంయుక్తంగా పరిశీలన చేపట్టారు. డిజిటల్‌ సర్వే నిర్వహించారు. కలెక్టర్‌ హరీశ్‌ దీనిని దగ్గరుండి పర్యవేక్షించారు. నిర్మాణాల కోసం చదును చేసిన స్థలాలు, అక్కడికి వెళ్లేందుకు వేసిన దారులు... ఇలా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని ఎక్కడెక్కడ ఆక్రమణలు చోటు చేసుకున్నదీ సిబ్బంది గుర్తించారు. ఉదయం 11.20 గంటల సమయంలో కలెక్టరు అచ్చంపేట గ్రామంలోని రైతుల వద్దకు వచ్చి ‘మీ వద్ద ఏ ఆధారాలున్నా అధికారులకు ఇవ్వండి’ అని సూచించారు. రైతులు చెప్పిన విషయాలను స్పష్టంగా రికార్డు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రానికి తుది నివేదిక సిద్ధం చేసి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సమర్పించారు. ఇది మొత్తం ఆరు పేజీలుంది. అచ్చంపేట గ్రామ పరిధిలో 66 ఎకరాల మేర సీలింగ్‌, అసైన్డు భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ‘‘అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో అసైన్డ్‌ భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదు అందింది. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాం. 66 ఎకరాల భూములు జమునా హేచరీస్‌ ఆధీనంలో ఉన్నట్టు గుర్తించాం. అటవీ శాఖ అధికారులు కూడా వచ్చారు. హేచరీస్‌కు వెళ్లేందుకు వీలుగా అడవిలో చెట్లు నరికేసి రోడ్డు వేసినట్లు గుర్తించారు. తదుపరి సమగ్ర విచారణ చేసి ఈ అంశంపైన కేసు నమోదు చేస్తాం’ అని కలెక్టర్‌ తెలిపారు.
నాలుగు బృందాలుగా విడిపోయి...
రాజేందర్‌ భార్య జమున పేరిట ఉన్న హేచరీస్‌కి సంబంధించిన భూములతో పాటు పక్కనే ఉన్న సీలింగ్‌, అసైన్డ్‌ స్థలాల్లో సర్వే చేసేందుకు యంత్రాంగం పక్కా కసరత్తు చేసింది. ఉదయాన్నే అధికారులు, రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈ నిర్మాణాలు, భూములు వివిధ చోట్ల ఉండటంతో వారిని నాలుగు బృందాలుగా విభజించారు. ప్రతి బృందంలో ఒక తహసీల్దారు, నలుగురు సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని పైనుంచి ఆదేశాలు రావడంతో అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. తమ వద్ద ఉన్న రికార్డులు తీసుకొని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులేంటనే విషయాన్ని గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే భారీ సంఖ్యలో పోలీసు బలగాలనూ మోహరింపజేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న కామారెడ్డి జిల్లా నుంచి పోలీసులు వచ్చారు. దాదాపు 100 మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సర్వే ప్రక్రియ పూర్తి చేశారు.

అచ్చంపేట గ్రామస్థులు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ విచారణ..
మాసాయిపేట మండలం అచ్చంపేటలో మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జా ఆరోపణలపై తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అధికారులు విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విజిలెన్సు అధికారులు తనిఖీలు కొనసాగించారు. అచ్చంపేట శివారులో పట్టా భూములను రైతుల నుంచి ఈటల కుటుంబసభ్యులు పరిశ్రమ పేరిట ఎన్ని ఎకరాలు, ఎవరెవరి నుంచి కొనుగోలు చేశారనే సమాచారాన్ని సేకరించారు. పూర్తి ఆధారాలతో కూడిన దస్త్రాలను వారు తీసుకెళ్లారు. అచ్చంపేట శివారులో 42 ఎకరాలు, హకీంపేట గ్రామ శివారులో 11 ఎకరాల భూమి ఈటల కుటంబసభ్యుల పేరిట రిజిస్ట్రేషన్‌ అయినట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ గాయసోద్దీన్‌ తెలిపారు. 2016 కంటే ముందు వెల్దుర్తి ఉమ్మడి మండలం రామాయంపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్లు కావడంతో అక్కడ సైతం వివరాలు తీసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు అచ్చంపేట భూమి వ్యవహారంలో తలమునకలు కావడంతో తూప్రాన్‌లో ధరణి రిజిస్ట్రేషన్లు సైతం ఆగిపోయాయి.
ప్రభుత్వ సూచిక బోర్డులు సైతం సిద్ధం
మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామ శివారులో ఈటల రాజేందర్‌ ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్న భూముల్లో సూచికలు ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. శనివారం ఒక వైపు అధికారులు సర్వేలు చేస్తుండగానే మరో వైపు ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు తూప్రాన్‌లో సిద్ధం చేయించారు. వీటిని ఆటోలో అచ్చంపేట, హకీంపేట ప్రభుత్వ భూముల్లో పాతేందుకు తీసుకెళ్లారు.

పంచాయతీ కార్యాలయానికి గ్రామస్థులు

రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న అచ్చంపేట గ్రామస్థులు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ధ్రువపత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు వెంట తెచ్చారు. అంతా ఒక చోట కూర్చొని తమకు ఏ సర్వే నంబరులో ఎంత భూమి కేటాయించారు? ప్రస్తుతం పరిస్థితి ఏంటనే వివరాలను కాగితంపై రాసి అధికారులకు అందించేందుకు ప్రయత్నించారు. గతంలో తమ పేర్లు పహాణీల్లో ఉన్నా భూ దస్త్రాల ప్రక్షాళన తర్వాత కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదన్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. ఇదివరకు తమకు కేటాయించిన ఈ భూములను తిరిగి తమకే ఇచ్చి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

విజిలెన్స్‌, ఏసీబీ అధికారుల విచారణ..

రైతుల ఫిర్యాదులోని లోతుపాతులను తెలుసుకునేందుకు మరోపక్క విజిలెన్స్‌, ఏసీబీ విభాగాలకు చెందిన అధికారులు కూడా రంగంలోకి దిగారు. కబ్జా ఎలా సాగింది, ఎవరు బలవంతం చేశారు తదితర వివరాలు సేకరించేందుకు ఉదయమే అచ్చంపేటకు చేరుకున్నారు. విజిలెన్స్‌ ఎస్పీ కె.మనోహర్‌, ఏసీబీ డీఎస్పీ ఆనందరావులు బృందాలుగా ఏర్పడి రైతులతో మాట్లాడారు. వారికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన ధ్రువపత్రాలు, కొత్తగా వచ్చిన పట్టాదారు పాసు పుస్తకాల నకళ్లు, ఇతర ఆధారాలను సేకరించారు. రైతులను ఒక్కొక్కరిని విడిగా పిలిచి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకునేందుకుయత్నించారు. శనివారం 10 మంది రైతులతో మాట్లాడామని, తమ విచారణ పూర్తయ్యేందుకు మరో 2 రోజుల సమయం పడుతుందని విజిలెన్స్‌ ఎస్పీ కె.మనోహర్‌ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతున్న తీరును విజిలెన్స్‌ ఐజీ పూర్ణచంద్రరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అచ్చంపేట చేరుకున్న ఆయన ఉన్నతాధికారులతోమాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇదీ చూడండి: ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్‌కు మెదక్‌ కలెక్టర్‌ నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.