ETV Bharat / state

జెమిసన్​తో పనిచేయనున్న మెడ్​ప్లస్​ - Med Plus work with Jemison

ఫార్మసీ రిటైలర్ సంస్థ మెడ్​ప్లస్.. కెనడాకు చెందిన ప్రముఖ హెల్త్ సప్లిమెంట్స్ తయారీ సంస్థ జెమిసన్​తో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

జెమిసన్​తో పనిచేయనున్న మెడ్​ప్లస్​
author img

By

Published : Nov 13, 2019, 11:20 PM IST

కెనడాకు చెందిన ప్రముఖ హెల్త్ సప్లిమెంట్స్ తయారీ సంస్థ జెమిసన్​తో కలిసి పనిచేయనున్నట్టు ఫార్మసీ రిటైలర్ సంస్థ మెడ్​ప్లస్ ప్రకటించింది. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెమిసన్ సీఈఓ మార్క్ హార్నిక్, మెడ్​ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి పాల్గొన్నారు. జెమిసన్​తో ఎక్స్​క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మధుకర్ స్పష్టం చేశారు.

జెమిసన్​కి సంబంధించిన ఉత్పాదనలను ఇకపై 1,700 పైగా ఉన్న మెడ్​ప్లస్ స్టోర్లలో విక్రయించనున్నారు. ఆఫ్​లైన్​తో పాటు ఆన్​లైన్​లోనూ ఈ అమ్మకాలు సాగనున్నాయి. జెమిసన్ వెల్ నెస్ కార్పొరేషన్ విస్తృత స్థాయిలో విటమిన్లు, మినరల్స్ సహా పలు రకాల ఆరోగ్య సప్లిమెంట్లను తయారు చేస్తోంది. అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందించే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నట్టు మెడ్​ప్లస్ వ్యవస్థాపకుడు మధుకర్ తెలిపారు.

జెమిసన్​తో పనిచేయనున్న మెడ్​ప్లస్​

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.