రానున్న వర్షాకాలం దృష్ట్యా స్వీయ ఆరోగ్య పరిరక్షణకై పారిశుద్ధ్య కార్మికులందరూ(sanitation workers).. విధిగా సేఫ్టీ కిట్లను(safety kits) ధరించి విధులకు హాజరు కావాలని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి(mayor vijayalaxmi) సూచించారు. డిప్యూటీ మేయర్‌తో కలసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మేయర్.. సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు.
ఇప్పటికే కార్మికులందరికీ ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయించినట్లు మేయర్ పేర్కొన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. రూ.4,133 విలువైన ఒక్కో హెల్త్ కిట్‌ను 2,374 మందికి తొలిదశలో పంపిణీ చేశారు. ఖరీదైన ఈ కిట్లను తప్పనిసరిగా వాడాలని మేయర్ సూచించారు.
ఇదీ చదవండి: SI Arrest: జవహర్‌నగర్ ఎస్సై అనిల్ రాసలీలలు