హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మేయర్ బొంతు రామ్మోహన్ నివాసం వద్ద ముప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నరాల పెంటన్న నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేయర్ పలువురు అనాథలు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు 50 కుటుంబాలకు 5 రోజులకు సరిపడా కిరాణా సామగ్రి అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయవాది కేదార్ జోషి అనాథలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి.. కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని మేయర్ సూచించారు. ప్రజలందరూ ఇళ్లలో పరిశుభ్రత పాటించాలని, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని శ్రీ వెంకటేశ్వర గ్రాండ్ కిచిన్ మేనేజింగ్ పార్ట్నర్ సూర్యప్రకాశ్ సూచించారు.
ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్ భేష్'